ఉనికిని చాటుకోవడం కోసమే అభివృద్ధిని అడ్డుకుంటున్న కాంగ్రెస్ నేతలు

జనం సాక్షి 22/09/2022

ఎల్కతుర్తి  రాజకీయ మనుగడ కోసమే కాంగ్రెస్ నాయకులకు రెండు నెలల క్రితం విడుదలైన జీవో కనబడడం లేదా అని ఎంపీపీ మేకల స్వప్న అన్నారు. గురువారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, తిమ్మాపూర్ నుండి సీతంపేట వరకు 51 లక్ష రూపాయలు. సీతంపేట నుండి మెయిన్ రోడ్ వరకు 62 లక్షల రూపాయలు, రెండు నెలల క్రితమే మంజూరైనది. మరియు అగ్రిమెంట్లు జరిగినది. వర్ష ప్రభావం వల్ల పనులు మొదలు కాలేదు. కాంగ్రెస్ నాయకులు బుధవారం మంత్రి ఎరబెల్లి దయాకరావును, స్థానిక ఎమ్మెల్యే వోడితల సతీష్ కుమార్ ను ,అడ్డుకున్నామని గొప్పలు చెప్పుకున్న నాయకులకు, ఈ జీవో కనబడడం లేదాని ఆమె ప్రశ్నించారు. మంత్రిని ఎమ్మెల్యేను అడ్డుకునే నైతిక హక్కు కాంగ్రెస్కు వారికి లేదని ఆమె అన్నారు అభివృద్ధి కోసం అడగాలనుకుంటే, అడిగే పద్ధతి అది కాదని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకుల ఉనికి ప్రజలు తెలియాలనే ఉద్దేశంతో, అడ్డుకున్నారే తప్ప ప్రజలకు మేలు చేసే ఉద్దేశం వారికి లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పార్టీలకు అతీతంగా ,ఇస్తున్న రైతుబంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంటు, ఆసరా పింఛన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ,కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు తీసుకోవడం లేదా, ఒకసారి గుండె మీద చేసుకుని వారే చెప్పాలని ఆమె సవాల్ విసిరారు .విమర్శలు మానుకొని అభివృద్ధి కోసం తగు మంచి సలహాలు ఇస్తే, స్వీకరించడానికి టిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందన్నారు. గత కాంగ్రెస్ హయాంలో ఎమ్మెల్యేలు పక్షపాతం చూపారేమో, కానీ మా ఎమ్మెల్యే వోడితల సతీష్ కుమార్, ఏనాడు పక్షపాతం లేకుండా ,అన్ని పార్టీల నాయకులకు, ప్రజలకు వ్యక్తిగతంగా మేలు చేశాడే తప్ప, వివక్షత చూపలేదన్నారు. వివక్షత చూపే వాడే అయితే, నిన్న ప్రారంభించిన మూడున్నర కోట్లలతో, సబ్స్టేషన్ దామెరలో నిర్మాణం అయ్యేది కాదన్నారు. ఈ సమావేశంలో స్థానిక ఎంపీపీ మేకల స్వప్న వైస్ ఎంపీపీ నగేష్ సొసైటీ చైర్మన్ శ్రీపతి రవీందర్ గౌడ్, ఎంపీడీసీల ఫోరం అధ్యక్షులు కడారి రాజు,రైతుబంధు మండల కన్వీనర్ పోరెడ్డి రవీందర్ రెడ్డి, సొసైటీ వైస్ చైర్మన్ మునిగడప శేషగిరి, రైల్వే బోర్డు మెంబర్ ఎల్తూరి స్వామి, టిఆర్ఎస్ నాయకులు వెంకటేష్ యాదవ్, పిట్టల మహేందర్, చింతలపల్లి సర్పంచ్ కుడితాడి అనిత రాజు,మంతుర్తీ సమ్మయ్య, పసునూటి శ్రీనివాస్ , పైన్డ్ల తిరుపతిరెడ్డి ,శ్రీరాముల కృష్ణమూర్తి, వల్లాల కుమార్, సూర్య సాంబరాజు, ఎండి నసుర్, మాధవరావు, ఒంకూరి సుధాకర్ తదితరులున్నారు.