ఎంఐఎం ఎమ్మెల్యే పాషాఖాద్రీపై కేసు
కరీంనగర్: అసెంబ్లీలో గాంధీ విగ్రహం ఏర్పాటుపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు ఎంఐఎం ఎమ్మెల్యే పాషాఖాద్రీపై కరీంనగర్ జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలైంది. కరీంనగర్ బీజేపీ నేత బండి సంజయ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. దినిపై స్పందించిన జిల్లా కోర్టు పాషాఖాద్రీ పై కేసు నమోదు చేయాలని కరీంనగర్ టూటౌన్ పోలీసులను ఆదేశాలు జారీ చేసింది.