ఎట్టిపరిస్థితుల్లో రాయల తెలంగాణను ఆమోదించం

హైదరాబాద్‌: రాయల తెలంగాణను ఎట్టి పరిస్థితులో ఆమోదించమని ఐకాస కన్వీనర్‌ కోదండరాం చెప్పారు. హైదరాబాద్‌తో  కూడిన 10 జిల్లాలను తాము డిమాండ్‌ చేస్తున్నామన్నారు. తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు రాయల తెలంగాణపై మాట్లాడడం శోచనీయమని ఆయన అన్నారు. జూలై 7న విస్తృతస్థాయి సమావేశంలో ప్రత్యేక తెలంగాణ కోసం కార్యాచరణ రూపకల్పన చేస్తామని కోదండరాం తెలియజేశారు.