ఎన్నికలకు నల్ల ధనాన్ని వినియోగించాలి- మమతా బెనర్జీ

కోల్‌కతా: విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకొచ్చి దాన్ని ఎన్నికల కోసం ప్రభుత్వమే ఖర్చుపెట్టాలని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఎన్నికలకు ప్రభుత్వమే పూర్తిగా ఖర్చుపెట్టేలా సంస్కరణలు తెచ్చేందుకు కేంద్రం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించాలన్నారు. ఎన్నికల్లో నల్లధనాన్ని నియంత్రించేందుకు వీలుగా ప్రభుత్మమే వాటికి పూర్తిగా నిధులు ఇవ్వాలన్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే పశ్చిమ బెంగాల్లో ఎన్నికల సందర్భంగా తక్కువ ధనబలం కనిపిస్తోందని చెప్పారు. రాష్ట్రాల ఆదాయంలో 75 శాతాన్ని తీసుకొంటున్న కేంద్రం ఎన్నికల నిర్వహణకు మాత్రం వాటికి ఎందుకు నిధులు ఇవ్వదని ప్రశ్నించారు.