ఎపీఎల్‌డీఏ ఆధ్వర్యంలో పశువైద్య శిబిరం

హుజూరాబాద్‌ టౌన్‌, జూలై 21, (జనంసాక్షి):హుజూరాబాద్‌ మండలంలోని స్థానిక పెద్దపాపయ్యపల్లె గ్రామంలో శనివారం ఎపిఎల్‌డిఎ ఆధ్వర్యంలో పశువైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ మాదవ్‌రావు మాట్లాడుతూ శిబిరంలో సుమారు 62పశువులకు గర్భకోశ వ్యాధులకు చికిత్స చేసినట్లు ఆయన తెలిపారు. 216 పశువులకు గాలి, కుంటు వ్యాధి నిరోధక టికాలు వేసినట్లు, 21 దూడలకు నట్టల నివారణ మందులు త్రాగించినట్లు ఆయన తెలిపారు. పశువైద్య శిబిరాలలో ప్రభుత్వం ఉచితంగా గాలి, కుంటు వ్యాధి నిరోధక టికాలు వెయించాలని, పశువైద్యుల సలహాలు, సేవలు వినియోగించుకొని అధిక పాల దిగుబడులు పొందాలని ఆయన ప్రజలకు, గ్రామస్థులకు సూచించారు. ఈ పశువైద్య శిబిరంలో ప్రభుత్వ వైద్య సిబ్బంది ఎం బాబాస్వామి, తిరుపతి, గోపాల మిత్రా సూపర్‌వైజర్‌ రవిందర్‌, రమేష్‌, రాజీవ్‌, రైతులు శ్రీనివాస్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డిలతో పాటు గ్రామ ప్రజలు పాల్నొన్నారు.