ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షులు రేగా కాంతరావు ను మర్యాద పూర్వకంగా కలిసిన సింగరేణి జిఎం
పినపాక నియోజకవర్గం సెప్టెంబర్ 02( జనం సాక్షి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ను శుక్రవారం ఇటీవల నూతనంగా బాధ్యతలు చేపట్టిన మణుగూరు సింగరేణి ప్రధాన అధికారి జి . వెంకటేశ్వర్లు రెడ్డి , మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం వారితో అనేక అంశాల మీద సుదీర్ఘంగా చర్చించారు ఈ కార్యక్రమంలో సింగరేణి ఎస్ ఓ టు జిఎం లలిత్ కుమార్ , టీబీజీకేఎస్ నాయకులు, టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.