ఎమ్మెల్యే సురేష్‌ను కోర్టులో హాజరుపరిచిన ఏసీబీ

హైదరాబాద్‌: గాలి బెయిల్‌ కుంభకోణం కేసులో మరో నిందితుడు కోర్టు మెట్లెక్కాడు. కర్ణాటకలోని కంపిలి ఎమ్మెల్యే సురేష్‌బాబును ఈ రోజు ఏసీబీ పోలీసులు నాంపల్లిలోని క్రిమినల్‌ కోర్టులో హాజరుపరిచారు. సురేష్‌ ఇంతకు ముందే ఏసీబీ అధికారుల ముందు లొంగిపోయిన విషయం తెలిసిందే.