ఎమ్మెల్సీ ఎన్నికలకు త్వరలో షెడ్యూల్
హైదరాబాద్: సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నీ మ్యాథ్యూతో కేంద్ర ఎన్నికల కమిషనర్ హెచ్, ఎస్, బ్రహ్మభేటీ అయ్యారు. భేటీలో ఓటరు నమోదు ప్రక్రియ, ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించినట్లు సమాచారం. ఈ సందర్భంగా బ్రహ్మా మీడియాతో మాట్లాడుతూ… ఎమ్మెల్సీ ఎన్నికలకు త్వరలో షెడ్యూల్ ప్రకటిస్తామని ఆయన తెలిపారు. ఓటరు నమోదు ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్ ఆగ్రస్థానంలో ఉందని పేర్కొన్నారు.