ఎర్రగడ్డ తండాలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ నేత డాక్టర్ కృష్ణ

జనగామ (జనంసాక్షి) సెప్టెంబర్25:జనగామ జిల్లా లోని ఎర్రగడ్డ తండా(మేకల గట్టు) గ్రామ యూత్ ఆధ్వర్యంలో గణేశుడి వద్ద ఏర్పాటుచేసిన మహా అన్నదాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని,భక్తులకు స్వయంగా భోజనం వడ్డించిన డాక్టర్ బోల్లెపల్లి కృష్ణ.
అనంతరం డాక్టర్ కృష్ణ గడప గడపకు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాల మేనిఫెస్టోను, కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు ప్రకటించిన రైతు,యూత్ డిక్లరేషన్, ఎస్సీ,ఎస్టీ డిక్లరేషన్లను & తెలంగాణ తల్లి సోనియమ్మ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. రానున్న ఎన్నికల్లో స్టేషన్గన్పూర్ లో కాంగ్రెస్ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. అదేవిధంగా సుదీర్ఘ రాజకీయ అనుభవము ఉన్న కడియం శ్రీహరి స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి చేసిందేమీ లేదని,మళ్లీ ప్రజలను మోసం చేయడానికి కడియం, రాజయ్య వస్తున్నారని ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని అన్నారు.కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇస్లావత్ జాను,నేతవాత్ భద్రు, నేతావత్ చంద్రు, ఇస్లావత్ భాస్కర్,తోట రజనీకాంత్, ఇస్లావత్ యాకుబ్,మధు,నేతవాత్ భద్రు,నేతవాత్ రవి,ఇస్లావత్ దిప్ల,ఇస్లావత్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు