ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మార్చ్‌ను విజయవంతం చేయాలి: కేసీఆర్‌

న్యూఢిల్లీ: తెలంగాణ మార్చ్‌కు ప్రభుత్వం అనుమతిచ్చిన నేపథ్యంలో మార్చ్‌ను విజయవంతం చేయండి అని తెలంగాణవాదులకు టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పిలుపునిచ్చారు. మార్చ్‌లో పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజలు పాల్గొనాలని కోరారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మార్చ్‌ను శాంతియుతంగా నిర్వహించండి అని పేర్కొన్నారు.