ఎల్లమ్మ ఆలయం వద్ద విజయలక్ష్మీ కాన్వాయిని అడ్డుకున్న తెలంగాణ వాదులు

మెదక్‌: ఎల్లమ్మ ఆలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. విజయమ్మ కాన్వాయిపై తెలంగాణ వాదులు రాళ్లతో దాడి చేశారు. స్కార్పియోతో పాటు 3వాహానాల అద్దాలు ధ్వంసంఅయ్యాయి. రైతులు పొలాలల నుంచి బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేశారు. తిరిగి వెళ్లాలంటూ నినాదాలు చేశారు. ఆందోళన చేస్తున్న వారిపై పోలీసులు దాడి చేశారు. విద్యార్థులపై, రైతులపై కూడా పోలీసులు దాడి చేశారు. దీంతో 3కిలో మీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించిపోయింది.