ఎవరో చంపి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్న బంధువులు

మండలం చిన్నగన్పూర్ శివారులో బుధవారం రాత్రి ఓ జోగిని మహిళ బైండ్ల గౌరీ గౌరమ్మ (47) అనుమానాస్పరస్థితిలో మృతి చెందింది. గురువారం తెల్లవారుజామున జాగింగ్ చేయడానికి వెళ్లిన పిల్లలకు  చిన్నాగన్పూర్ నుంచి జోగిపేట వెళ్లే రూట్లో రోడ్డు కింది భాగంలో ఒక మహిళ మృతదేహం కనిపించింది. వారు సర్పంచ్ భర్త సందీప్ కు సమాచారం ఇవ్వగా, సంఘటన స్థలికి వచ్చి మృతురాలు కుటుంబీకులకు సందీప్ సమాచారం ఇచ్చారు. కొల్చారం ఎస్సై శ్రీనివాస్ గౌడ్ సంఘటన జరిగిన చోటుకు తన సిబ్బందితో వెళ్లి పరిసర ప్రాంతాల్లో లభించిన ఆధారాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ లోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా సంఘటన స్థలంలో మద్యం బాటిల్, కల్లు ప్యాకెట్లు, వాటర్ బాటిల్ లభించడంతో ఎవరో హత్య చేశారన్న అనుమానాలు ఉన్నట్లు మృతురాలు సోదరులు తెలిపారు.