ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళికకు చట్టబద్ధత కల్పించాలి: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌: ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికకు ఈ అసెంబ్లీ సమావేశాల్లో చట్టబద్ధత కల్పించకపోవటంపై భాజపా అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికకు చట్టబద్ధత కల్పించాలంటూ ట్యాంక్‌బండ్‌ అంబేద్కర్‌ విగ్రహం నుంచి అసెంబ్లీ వరకూ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు., అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచైనా దీనికి చట్టబద్ధత కల్పించాలని కిషన్‌రెడ్డి డిమాండ్‌ వ్యక్తం చేశారు.