ఎస్సీ వర్గీకరణపై దీక్ష చేయండి: వర్ల

హైదరాబాద్‌: అన్ని సమస్యలపై తల్లి విజయమ్మతో దీక్షలు చేయిస్తున్న జగన్‌ చిత్తశుద్ధి ఉంటే ఎస్సీ వర్గీకరణ అమలుచేయాలంటూ తల్లితో దీక్ష  చేయించాలని తెదేపా ప్రధాన కార్యదర్శి వర్లరామయ్య డిమాండ్‌ చేశారు. మాదిగ వర్గానికి తీరని అన్యాయం చేసింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సేనని అన్నారు. ఎస్సీ వర్గీకరణపై వైకాపా తన వైఖరి ప్రకటించాలన్నారు.