ఎస్సీ వర్గీకరణ జరిగే వరకు అన్ని ఉద్యోగ నియామక పరీక్షల ఫలితాలు నిలిపివేయాలి

` ఎస్సీ వర్గీకరణపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మందకృష్ణ మాదిగ లేఖ
హైదరాబాద్‌(జనంసాక్షి): ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ బహిరంగ లేఖ రాశారు. ఎస్సీ వర్గీకరణ జరిగే వరకు అన్ని రకాల ఉద్యోగ నియామక పరీక్షల ఫలితాలు నిలిపివేయాలని లేఖలో పేర్కొన్నారు. ఈ నెల 12 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ కోసం చట్టం చేస్తామని చెప్పి మరోవైపు గ్రూప్స్‌ ఫలితాల వెల్లడి తేదీలను ప్రకటించడం సరైంది కాదన్నారు. దీంతో ఎస్సీలకు మరోసారి అన్యాయం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.