ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ అభ్యర్థులకు హాల్‌టికెట్లు జారీ

హైదరాబాద్‌: పోలీసుశాఖలోని కమ్యూనికేషన్‌, పీటీవో, ఫింగర్‌ ప్రింట్‌ బ్యూరోలో వివిధ విభాగాలకు సంబంధించి కానిస్టేబుల్‌, ఎస్‌ఐ స్థాయి అభ్యర్థులకు రాత పరీక్ష తేదీలను ఖరారు చేసి హాల్‌టికెట్లు జారీచేసినట్లు రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి ఛైర్మన్‌ మాలకొండయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసు కానిస్టేబుల్‌ (కమ్యూనికేషన్‌, మెకానిక్స్‌, డ్రైవర్లు) అభ్యర్థులకు అక్టోబరు 3వ తేదిన రాత పరీక్ష నిర్వహించేందుకు 1,388 మందికి హాల్‌ టికెట్లు పంపించామని పేర్కొన్నారు. సబ్‌ఇన్స్‌పెక్టర్లు, అసిస్టెంట్‌ సబ్‌ఇన్స్‌పెక్టర్‌ అభ్యర్ధులకు అక్టోబరు 5వ తేదీన రాతపరీక్ష నిర్వహించేందుకు 3,461 హాల్‌టికెట్లు జారీచేసినట్లు తెలిపారు.