ఏఎస్పీతో డీఐజీ చర్చలు

కాకినాడ: తూర్పుగోదావరి ఎస్పీ త్రివక్రమవర్మపై తీవ్ర ఆరోపణలు చేసిన ఏఎస్పీ నవీన్‌కుమార్‌తో డీఐజీ సూర్యప్రకాశ్‌రావు చర్చలు చేపట్టారు. లంచగొండి ఎస్పీతో వేగలేకపోతున్నానని,తనపై వేధింపులకు పాల్పడుతూ చంపడానికి ప్రయత్నించారని నవీన్‌కుమార్‌ సోమవారం మీడియాకు తెలియజేశారు. ఎస్పీ వల్ల తనకు ప్రాణహాని ఉందంటూ రంపచోడవరం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.