ఏయూ విద్యార్థినిపై కత్తితో దాడి
విశాఖ : మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవతున్నా అకృత్యాలు మాత్రం ఆగడం లేదు. విశాఖ జిల్లా గోపాలపట్నంలో విద్యార్థినిపై ఓ ఆగంతకుడు కత్తితో దాడికి పాల్పడ్డారు. స్థానిక పెట్రోల్ బంక్ వద్ద ఆటో ఎక్కుతున్న ఏయూ విద్యార్ధినిపై ఆగంతకుడు కత్తితో గాయపరిచి పరారయ్యాడు. తీవ్ర గాయాలపాలైన ఆమెను స్థానికులు కేజీహెచ్‌కు తరలించారు.