ఏసీబీకి చిక్కిన ఉప ఖజానా శాఖ అధికారి

తిరుపతి : ఫించన్‌దారుని నుంచి రూ.5 వేలు లంచం తీసుకుంటూ తిరుపతి ఉపఖజానా శాఖ అధికారి ఏసీబీకి చిక్కాడు. ఉప ఖజానా కార్యాలయం సీనియర్‌ అకౌంటెంట్‌ క్రాంతికుమార్‌ లంచం తీసుకుంటుండగా వలపన్ని పట్టుకున్నామని ఏసీబీ అధికారులు తెలిపారు.