ఏసీబీ నోటీసులు సమంజసం కాదు

ఖమ్మం:ప్రజాసమస్యలపై పోరాడుతున్న ఉద్యమపార్టీల నేతలకు ఏసీబీ నోటీసులు జారీ చేయడం సమంజసం కాదని  సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమొక్రసి జిల్లా కార్యదర్శి పోతురంగారావు చెప్పారు.జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రజా ఉద్యమాల్లో భాగంగా వివిధ వ్యాపార వర్గాల నుంచి చందాలు వసూలు చేస్తారని,వాటిని ముడుపులుగా చేయడాన్ని ఆయన ఖండించారు. దీనికి వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహించనున్నట్లు  తెలియజేశారు.