ఏసీబీ వలలో సంగారెడ్డి డీఈవో రాజేష్ 

జనం సాక్షి సంగారెడ్డి రూరల్

 సంగారెడ్డి: ఓ ప్రైవేటు పాఠశాల యాజమాన్యం నుంచి రూ.50వేలు లంచం తీసుకుంటూ డీఈవో (జిల్లా విద్యాధికారి) ఏసీబీకి రెడ్ హ్యండెడ్ గా పట్టుబడిన ఘటన సంగారెడ్డి జిల్లా కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఓ ప్రైవేటు పాఠశాలకు ఎన్.వో.సీ ఇచ్చేందుకు గాను జిల్లా విద్యాధికారి నాంపల్లి రాజేష్ రూ.50వేలు డిమాండ్ చేశాడు. దీంతో సదరు పాఠశాల యాజమాన్యం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. పథకం ప్రకారం శుక్రవారం సంగారెడ్డి లోని జిల్లా విద్యా శాఖ కార్యాలయానికి ప్రైవేట్ పాఠశాల నిర్వాహకులు రూ.50వేల లంచం ఇచ్చేందుకు వచ్చారు. ఈ క్రమంలో అక్కడే మాటు వేసిన ఏసీబీ అధికారులు డీఈవో రాజేష్ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా అతడిని, తన అసిస్టెంట్ రామకృష్ణను అదుపులోకి తీసుకున్నారు.