ఐఎన్‌డీ సదుపాయం నిలిపివేత

న్యూఢిల్లీ: ప్రీపెయిడ్‌ నంబర్లకు ఐఎన్‌డీ సదుపాయం నిలిపివేయాలని టెలికాం కంపెనీలకు టెలికాం రెగ్యులారటీ అథారటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్‌) ఆదేశాలు జారీ చేసింది. విదేశాల నుంచి అనవసరమైన ఫోన్లు వస్తున్నాయన్న వినియోగదారుల ఫిర్యాదు మేరకు ఈ మార్గదర్శకాలు జారీ చేసినట్లు ట్రాయ్‌ తెలిపింది. నిలిపివేతపై 10 రోజుల్లోగా వినియోగదారులకు ఎన్‌ఎంఎన్‌ ద్వారా తెలపాలని టెలికాం కంపెనీలకు ఆదేశించింది.