ఐకేపీ నూతన గోదామును ప్రారంభించిన ఎమ్మెల్యే

బై0సా. రూరల్ మార్చ్25 జనం సాక్షి బైంసా మండల కేంద్రంలోని ఐకెపి నూతన గోదామును శనివారం ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి ప్రారంభించారు.ఐకేపీ ఉద్యోగులకు పే స్కెల్ ఇచ్చి వారికీ తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పిన సి.యం కెసిఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఆనందం వ్యక్తం చేశారు.ముధోల్ తాలూకాలో మొత్త0 98లక్షల 33 వేయిల రూపాల వడ్డీ డబ్బులను మన తెలంగాణ ప్రభుత్వం జమ చేయటం జరిగిందని అన్నారు.అనంతరం మాట్లాడుతూ….రైతులు పండిచిన పంటను పంట నిల్వ ఉంచటానికి తాలూకాకు సుమారు 2 కోట్ల రూపాయిలతో ఒక గోదాము కూడా మంజురు కావటం జరిగిందని,వీటి పనులను తొందరలో ప్రారంభిస్తామని, మహిళా సంఘం ల యొక్క రుణాల వడ్డీ డబ్బులను తిరిగి చెల్లించినందుకు మంత్రి హరీష్ రావుకి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు.ఈ కార్యక్రమం లో మండల ఎంపీపీ కల్పన గణేష్,బి.అర్.ఎస్ సీనియర్ నాయకులు సోలాంకి భీంరావు, వైస్ ఎంపీపీ గంగాధర్, కో ఆప్షన్ సభ్యలు గజానాన్ మరియు లోకాశ్వరం మండల వైస్ ఎంపీపీ నారాయణ గారు మరియు మండల సర్పంచ్ లు ఎంపీటీసీ లు మరియు ప్రజా ప్రతినిధులు మరియు మహిళా సంఘం అధ్యక్షులు మరియు సభ్యులు పాల్గొన్నారు.