ఐటీ సంస్థల విస్తరణకు కేంద్రం అనుమతి

హైదరాబాద్‌: రాజధాని నగర పరిసర ప్రాంతాల్లో ఐటీ సంస్థల విస్తరణకు కేంద్రం అనుమతి ఇచ్చింది. నగరంలోని మూడు ప్రాంతాల్లో 50 వేల ఎకరాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖమంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలియజేశారు. మామిడిపల్లి రావిర్యాల, ఆదిభట్ల-మహేశ్వరం,ఉప్పల్‌-పోచారంలో వీటిని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సంస్థల ఏర్పాటుతో ప్రత్యక్షంగా 15 లక్షల, పరోక్షంగా 50 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు.