ఐదు రోజుల్లోనే 100కోట్ల వసూళ్లు -సరికొత్త రికార్డును సృష్టించిన ‘ఏక్‌ థా టైగర్‌’

ముంబయి: బాలీవుడ్‌లో సల్మాన్‌ఖాన్‌ హావా కొనసాగుతోంది. తను నటించిన ‘ఏక్‌ థా టైగర్‌’ సినిమా ఐదు రోజుల్లో రూ.100 కోట్లు వసూలు చేసింది. ఆగస్టు 15న విడుదలైన ఈ సినిమా మొదటి రోజే రూ.32కోట్లు వసూలు చేసి హృతిక్‌ రోషన్‌ నటించిన ‘అగ్నిపథ్‌’ రికార్డును బద్దలు కొట్టింది. ‘ఏక్‌ థా టైగర్‌’ ఐదు రోజుల్లో రూ.100.16 కోట్లు వసూలు చేసినట్లు సల్మాన్‌ సోదరి అర్పిత ధ్రువీకరించారు. బాలీవుడ్‌ చరిత్రలోనే ఇది సరికొత్త రికార్డుగా ఆమె పేర్కోన్నారు. సల్మాన్‌ఖాన్‌కు కలెక్షన్లలో ఇది నాలుగో సెంచరీ. గతంలో తన సినిమాలు ‘దబాంగ్‌’ రూ.147 కోట్లు. ‘రెడీ’ రూ.122 కోట్లు, ‘బాడీగార్డ్‌’రూ.148కోట్లు వసూలు చేశాయి.