ఐసీసీ ప్రెసిడెంటుగా బాధ్యతలు చేపట్టిన ఐజాక్‌

కౌలాలంపూర్‌:  ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడిగా అలస్‌ ఐజాక్‌ ఈ రోజు బాధ్యతలు చేపట్టారు. ఐసీసీ వార్షిక సమావేశంలో ఆయన శరద్‌పవార్‌ నుంచి బాధ్యతలు తీసుకున్నారు. న్యూజిలాండ్‌కు చెందిన ఈ మాజీ క్రికెటర్‌ రెండేళ్లపాటు ఐసీసీ అధ్యక్ష పదవిలో కొనసాగుతారు. గత రెండేళ్లుగా ఆయన ఐసీసీ వైస్‌ ప్రెసిడెంటుగా ఉన్నారు.