ఒలంపిక్స్‌లో భారత్‌కు ఆరో పతకం

లండన్‌: లండన్‌ ఒలంపిక్స్‌లో భారత్‌ మరో పతకం సాధించింది. రెజ్లింగ్‌లో 66 కిలోల ఫ్రీస్టైల్‌ విభాగంలో సుశీల్‌కుమార్‌ రజతం సాధించాడు. ఆదివారం జరిగిన ఫైనల్‌లో జసాన్‌కు చెందిన యెనిమిత్సు చేతిలో 1-3 తేడాతో పరాజయం పాలై కొద్దిలో స్వర్ణాన్ని కోల్పోయాడు. ఇది ఈ ఒలంపిక్స్‌లో భారత్‌కు ఆరో పతకం కాగా, రెండో రజతం.