ఒలింపిక్స్‌ తొలిరౌండ్‌లో

ఓటమి పాలైన రెజ్లర్‌ గీతాఫోగత్‌
లండన్‌ ఒలింపిక్స్‌ క్రీడల్లో మరో క్రీడాకారిణి పోటీల నుంచి వైదోలిగింది.ఇండియన్‌ మహిళా రెజ్లర్‌ గీతాఫోగత్‌ తొలిరౌండ్‌లో కెనడాకు చెంది న నెంబర్‌2 అంతర్జాతీయ మహిళారెజ్లర్‌ టోన్య లిన్‌ చేతిలో పరాజయం పాలయ్యింది.55కేజిల విభాగంలో జరిగిన ఈపోటీల్లో తొలి రౌండ్‌లోనే గీత పరాజయాన్ని చవిచూసింది.23ఏళ్ల గీత, 2010 కామన్వెల్త్‌ క్రీడల్లో బంగారు పతకాన్ని సాధించింది.కానీ ఒలింపిక్‌ క్రీడల్లో మాత్రం పేలవమైన ప్రదర్శనను కనబరిచి పోటీ నుంచి వైదొలిగింది.