ఓటింగ్ మందకొడిగా సాగుతోంది – ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి…

హైదరాబాద్ : తెలంగాణ ప్రాంతంలోని నగరంలో పోలింగ్ మందకొడిగా సాగుతోందని ఎంపీ విశ్వేశ్వరెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానానికి ఆదివారం పోలింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా శేరిలింగంపల్లిలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద టెన్ టివితో ఎంపీ విశ్వేశ్వరరెడ్డి మాట్లాడారు. ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఓటర్లకు పలు ఇబ్బందులు రావడం వల్ల ఓటింగ్ తక్కువగా నమోదవుతుందని పేర్కొన్నారు. హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానానికి బీజేపీ – టీఆర్ఎస్ మధ్యే పోటీ ఉందన్నారు. చేవెళ్ల, వికారాబాద్ తదితర ప్రాంతాల్లో టీఆర్ఎస్ కు మెజార్టీ ఉందని, శేరిలింగం పల్లి, రాజేంద్రనగర్ లో పోటీ నెలకొందని ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.