ఓటు వేసిన స్పీకర్‌ మనోహర్‌, జేపీ

హైదరాబాద్‌: రాష్ట్రపతి ఎన్నిక కోసం రాష్ట్ర అసెంబ్లీలో ఓటింగ్‌ ప్రక్రియ ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ ముందుగా వచ్చి అసెంబ్లీ కమిటీ హాల్‌లో ఓటు వేశారు. అనంతరం లోకసత్తా అధినేత జేపీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటింగ్‌ కోసం అసెంబ్లీ కమిటీ హాల్‌లో 3 కంపార్ట్‌మెంట్లు ఏర్పాటు చేశారు. పలువురు ఎమ్మెల్యేలు ఓటు వేసేందుకు అసెంబ్లీ చేరుకుంటున్నారు.