ఓపక్క వర్షాభావం…మరో పక్క వరదలు

ఢిల్లీ: ఓ పక్క ఉత్తర భారతమంతా రుతుపవనాల రాకకోసం నోరు తెరుచుకుని ఎదురు చూస్తోంది. అక్కడ ఇంకా ఎండలు మండుతూనే ఉన్నాయి. రిజర్వాయర్లలో నీరు అడుగంటింది. వాస్తవానికి జూన్‌ మూడో వారంలోనే ఉత్తరాది రాష్ట్రాలను రుతుపవనాలు తాకాలి. కానీ ఇంతవరకూ ఆ భాగ్యం కలగలేదు. దాంతో అన్ని రాష్ట్రాల్లోనూ వర్షాపాతం చాలా తక్కువగా నమోదైంది. మరో పక్క ఈ శాన్య భారతం వరదల్లో మునిగివుంది. అసోంలో వరదల వల్ల ఇప్పటికే 77మంది మరణించారు. అక్కడ 27జిల్లాలు వరదనీట మునిగివున్నాయి. ప్రధాని మన్మోహన్‌సింగ్‌, యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీ వరద ప్రాంతాల్ని చూసి సహాయక చర్యల్ని పర్యవేక్షించడానికి ఈరోజు జోర్హాట్‌ చేరుకున్నారు. మేఘాలయ రాష్ట్రంలో వరదల వల్ల 75వేల మంది నిరాశ్రయులయ్యారు. ఇది ప్రస్తుతం ఉత్తర భారత పరిస్థితి.