ఓయులో భాష్ప వాయువు ప్రయోగం

హైదరాబాద్‌: రాష్ట్ర్టపతి ఎన్నికల నేపథ్యంలో తెలంగాణకు వ్యతిరేఖంగా వ్యవహిరిస్తున్న యుపిఏ అభ్యర్థి ఓటు వేయకుడదని. డిమాండ్‌ చేస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్తులు ర్యాలీ తీశారు. శాసనసభ వరకు ర్యాలీ కొనసాగించాలని వారు తలపెట్టారు అయితే వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఎన్‌సీసీ గేట్‌వద్ద ఆపేశారు. విద్యార్థులు ప్రణబ్‌ ముఖర్జీ దిష్టిబొమ్మ దహనం చేశారు. భారీగా గేట్లు తెంచుకుని పోవాటానికి యత్నించిన విద్యార్థులపై పోలీసులు భాష్ప వాయువు ప్రయోగం చేశారు. విద్యార్థి నాయకులను అదుపులోకి తీసుకున్నారు.