ఓయూ పరీక్షలు వాయిదా

హైదరాబాద్‌: ఈ నెల 28, 29 తేదీల్లో ఉస్మానియా యూనివర్శిటీ పరిధిలో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయని రిజిస్ట్రార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. పీహెచ్‌డీ ప్రవేశాల ఇంటర్వ్యూలు కూడా వాయిదా పడినట్లు వారు తెలిపారు. ఇవి మళ్లీ ఎప్పుడు జరిగేది త్వరలో తెలియజేస్తామన్నారు.