కంటి వెలుగు  స్క్రీనింగ్ లో ఫాస్ట్, అద్దాల పంపిణీలో లాస్ట్

గద్వాల నడిగడ్డ, మార్చి 24 (జనం సాక్షి);
జోగులాంబ గద్వాల జిల్లాలో కంటి వెలుగు స్క్రీనింగ్ లో ఫస్ట్ ,అద్దాల పంపిణీలో లాస్ట్ అని జిల్లాలోని ఆయా గ్రామ ప్రజల ఆరోపిస్తున్నారు.జిల్లాలో శుక్రవారం వరకు మొత్తం కంటి వెలుగు బృందాల సంఖ్య 25,
కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా  మొత్తం స్క్రీనింగ్ చేసిన వ్యక్తుల సంఖ్య 1,42,554, కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా మొత్తం రీడింగ్ గ్లాసెస్, డిస్ట్రిబ్యూషన్ చేసిన సంఖ్య 16,960,కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా మొత్తం ప్రిస్పెక్షన్ గ్లాసెస్ కొరకు, వ్యక్తులను స్క్రీనింగ్ చేసి, ఆర్డర్ చేసిన గ్లాసెస్  సంఖ్య 17,744,కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా  ప్రెస్క్రిప్షన్ గ్లాసెస్ డిస్ట్రిబ్యూషన్ చేసిన సంఖ్య 8161 కాగా ఇంకా, పంపిణీ కానీవి  9,583. జనవరి నెలలో చేసిన వారికి కూడా చాలామందికి కంటి అద్దాలు ఇవ్వలేదనీ, ఈ విషయంపై డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ సిద్ధప్ప ను  వివరణ కోరగా ఆన్లైన్ లో  మేము పంపుతామని ప్రజలు కూడా మా దృష్టికి తెచ్చారని ఈ విషయాన్ని రాష్ట్ర స్థాయి  అధికారులతో మాట్లాడి త్వరగా వచ్చేటట్లు చూస్తామని ఆయన అన్నారు.