కటక్‌లో పాకిస్థాన్‌ మహిళా క్రికెట్‌ జట్టు

న్యూఢిల్లీ : మహిళల ప్రపంచకప్‌ మ్యాచ్‌లను పాకిస్థాన్‌ మహిళా క్రికెట్‌ జట్టు కటక్‌లో ఆడనుంది. ముంబయిలోజరాగాల్సిన గ్రూపు-బి మ్యాచ్‌లను భువనేశ్వర్‌, కటక్‌లలో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. భారత్‌-పాక్‌ల మధ్య ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితుల దృష్యా ఆ జట్టుకు పూర్తి భద్రత కల్పిస్తామని ఐసీసీ నిర్ణయించింది.