కడప, చిత్తూరు సరిహద్దులో మళ్ళీ ఏనుగుల కలకలం

సుండుపల్లి, కడప: కడప, చిత్తూరు జిల్లాల సరిహద్దు మండలాలైన సుండుపల్లి, చేవిపల్లి మండలాల శివారు ప్రాంతాలైన పొలాల్లొకి శేషాచల పర్వత శ్రేణుల నుంచి సోమవారం రాత్రి మళ్లీ ఏనుగులు ప్రవేశించి కలకలం సృష్టించాయి. భారీగా మామిడితోటలకు నష్టం కలిగించాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీసిబ్బంది ఏనుగులను అడవుల్లోకి తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు.