కడప జిల్లాలో పోలీసులు అలర్టు డిపోలకు తరలివెళ్తున్న ఆర్టీసీ బస్సులు

కడప, మే 27 (జనంసాక్షి):
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహన ్‌రెడ్డిని సీబీఐ అరెస్టు చేయనున్నారన్న ఉహగా నాలు బలంగా వినిపిస్తుండడంతో కడప జిల్లాలో పోలీసులు పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులను పూర్తి స్థాయి లో నిలిపివేశారు. అవినీతి అక్రమాల కేసులో జగన్‌ను మూడు రోజులుగా సిబిఐ విచారిస్తున్న విషయం తెలిసిందే. మూడవ రోజు ఆయన విచారణ సందర్భంగా పోలీసులు అప్రమత్త మయ్యారు. జగన్‌ను అరెస్టు చేయనున్నారన్న ఊహగానాలు బలంగా వినిపిస్తుండడంతో పోలీ సులు అప్రమత్తమయ్యారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రధాన కూడళ్లలో పోలీసులు మోహరించారు. జిల్లాలోని 8 ఆర్టీసీ ఢిపోలలో బస్సులను ఎక్కడికక్కడే నిలిపివేశారు. అదేవిధంగా వివిధ మార్గాలలో వెళ్తున్న బస్సులను కూడా పోలీసులు డిపోలకు తరలిస్తున్నారు. ఉన్నఫళంగా చోటు చే సుకున్న ఈ పరిణామాలతో ప్రయాణీకులు ఇబ్బం దులు పడుతున్నారు. అధికారింగా ఎలాంటి సమాచారం లేదని ముందు జాగ్రత్త చర్యలో భాగ ంగానే తాము ఆర్టీసీ బస్సులను నిలిపివేస్తున్నా మని కడప ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్‌ సుదేశ్‌ కుమా ర్‌ ఇఎంఎస్‌కు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా అన్ని డిపోల బస్సులను నిలిపివేశామన్నారు. అన్ని ప్రధాన కూడళ్లలో పోలీసులు మోహరించారు. ఎ క్కడికక్కడ పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు. దీంతో వ్యాప్తంగా ఉత్కంఠ పరిస్థితులు నెలకొంది.