కన్నుల పండువగా జయ్యారంలో

బసంత్‌నగర్‌, జూన్‌ 11, (జనంసాక్షి):

మండలంలోని జయ్యారం గ్రామంలో బీరన్న జాతర ఉత్సవం సోమవారం భక్తులు కన్నుల పండుగగా నిర్వహించారు. యాదవులు తమ ఆరాధ్యదైవమగు బీరన్నకు భక్తి శ్రద్దలతో పూజలందించారు. ఇంటిల్లి పాది పెద్దలు, మహిళలు, పిల్లలు తమ మొక్కులను తీర్చుకున్నారు. అంతేగాక జాతర ఉత్సవంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. భజన నిర్వహించారు. యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వ హిస్తున్న జాతర ఈనెల 20వరకు జరుగుతుంది. ఈ జాతరలో బీరన్నను నెయ్యి, పాలతో అభిషేకించనుండగా… పోచమ్మ బోనాలు, దేవుళ్లను బావిలో దాచిపెట్టడం, వెతుకులాడటం, లగ్నపట్నాలు, బోనాలు, నాగవెల్లి బోనాలు, పట్నాలను ఈ జాతరలో దశలవారీగా నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు మండలంలోని గ్రామాలతో పాటు జిల్లాలోని ఇతర ప్రాంతాలను యాదవులు తరలివస్తున్నారు.