కరీంనగర్ జిల్లాలో కొనసాగుతున్న తెదేపా బంద్
కరీంనగర్ : నేతల అక్రమ అరెస్టులకు నిరసనగా తెదేపా ఇచ్చిన పిలుపుమేరకు జిల్లాలో బంద్ కొనసాగుతొంది. కరీంనగర్‌తోపాటు పలు మండలాలల్లో ఆ పార్టీ నేతలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. విద్యుత్ కోతలను ఎత్తివేమాలని ఎన్‌ఈ కార్యాలయాన్ని ముట్టడించిన సందర్భంగా నేతలు కార్యాలయంపై దాడి చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసులు ముగ్గురు ఎమ్మెల్యేలు సహా 12 మందిపై బెయిల్ రాని విధంగా కేసులు నమోదు చేశారు. ఎమ్మెల్యేలు సుద్దాల దేవయ్య, విజయ రమణారావును అదుపులోకి తీసుకోని రిమాండ్‌కు పంపారు. పార్టీ నేతల అరెస్టుపై మండిపడ్డ తెదేపా జిల్లా యంత్రాంగం నేడు బంద్‌తోపాటు జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించింది.