కర్ణాటకకు ప్రత్యేక బలగాలు: పోలీస్‌ కమిషనర్‌

హైదరాబాద్‌: తీవ్రవాదుల అరెస్ట్‌ నేపథ్యంలో కర్ణాటకకు ప్రత్యేక బలగాలను పంపుతున్నట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ అనురాగ్‌శర్మ తెలియజేశారు. బెంగుళూరులో అరెస్టయిన హుజీ తీవ్రవాదులకు రాష్ట్రంలో సంబంధాలపై ఆరా తీస్తారని ఆయనర తెలిపారు.హుజీ తీవ్రవాదసంస్థ జాబితాలో ఉన్న జాడలు లేవన్నారు. గణేశ్‌ నిమజ్జనం, అంతార్జాతీయ జీవ వైవిధ్య సదస్సు నేపథ్యంలో భారీగా భద్రతా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.