కర్ణాటకలోనది సంకీర్ణ ప్రభుత్వం కాదు: ఈశ్వరప్ప

బెగుళూరు: కర్ణాటకలో ఎటువంటి సంకీర్ణ ప్రభుత్వం లేదని, భాజపానే పాలనలోనే ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.ఎస్‌. ఈశ్వరప్ప అన్నారు. కర్ణాటకలో కేజేపీ మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వం నడుస్తోందన్న పార్టీ రెబల్‌ నేత యడ్యారప్ప చేసిన ఆరోపణల్ని తిప్పికొట్టారు. భాజపా ప్రభుత్వం సజావుగా పూర్తికాలం నిలుస్తుందని ఆయన జోస్యం చెప్పారు.