కలెక్టరేట్ లో కొలువుదీరిన గణపతి
పూజలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ అర్. వి. కర్ణన్
కరీంనగర్ బ్యూరో ( జనం సాక్షి ) :
జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ప్రాంగణంలో బొజ్జ గణపతి కొలువుదీరాడు. గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా బుధవారం కలెక్టరేట్ ప్రాంగణంలోని ప్రధాన ద్వారం చెంత మామిడి తోరణాలు, పూలదండలతో అందంగా అలంకరించిన మండపంలో మట్టితో చేసిన వినాయకుడి ప్రతిమను పెట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆర్. వి. కర్ణన్ వినాయకుడికి తొలి పూజలు నిర్వహించారు. వేద పండితుడు గణపతి స్తోత్రం పఠించి, కలశస్థాపన చేసి పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. పూజ అనంతరము కలెక్టర్ కు కంకణ ధారణ చేశారు. కలెక్టర్ గణపతి దేవుడికి కొబ్బరికాయ కొట్టి తీర్థ ప్రసాదాలు, హారతి స్వీకరించారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్, కలెక్టరేట్ ఏఓ నారాయణ, తహసిల్దార్ సుధాకర్, కలెక్టరేట్ సూపర్డెంట్ అనంతరెడ్డి, అధికారులు, ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.