కలెక్టర్ ను కలిసిన శివ్వంపేట జర్నలిస్టులు
శివ్వంపేట ఆగస్ట్ 31 జనంసాక్షి : కొన్ని సంవత్సరాల నుంచి శివ్వంపేట మండలంలో వివిధ పత్రికలకు జర్నలిస్టులుగా పని చేస్తూ ఇటు ప్రభుత్వానికి అటు ప్రజలకు వారధిగా ఉంటూ, ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి, అధికారుల దృష్టికి, ప్రజా ప్రతినిధుల దృష్టికి, తీసుకు వెళ్లడంలో కీలక భూమిక వహిస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ బుధవారం మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్ ను జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంలోని కలెక్టరేట్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరీష్ మాట్లాడుతూ మీ అందరికీ ఇళ్ల స్థలాలు వచ్చేలా కృషి చేస్తాననీ మీ వినతినీ సీసీఎల్ఏ కు పంపించి అక్కడి నుంచి ఆర్డర్ వచ్చేలా కృషి చేస్తామన్నారు. మొన్నటి వరకు సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉండడం వల్ల ఎవరికీ ఈ స్థలాలు ఇవ్వలేదని మూడు రోజుల క్రితం కేసును సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందన్నారు. కాబట్టి అందరికీ ఇళ్ల స్థలాలు వచ్చేందుకు మార్గం సులభతరం అయిందని ఆయన చెప్పారు. జిల్లా కలెక్టర్ ను కలిసిన వారిలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బొడ్డు రవి, ఉపాధ్యక్షుడు వజ్జ రాజు, గౌరవ అధ్యక్షులు ఇసుగారి మల్లేశ్, అబ్దుల్ అజీజ్, ప్రధాన కార్యదర్శి పోచ గౌడ్, సలహాదారు ముండ్రాతి బాలేష్, కోశాధికారి బుర్ర మహేష్ గౌడ్, కార్యవర్గ సభ్యులు నటరాజ్ గౌడ్, బాసంపల్లి కిషోర్ గౌడ్, కొత్త కుమ్మరి ప్రకాష్, పోల్ దాస్ వెంకటస్వామి, పల్లె వీరేష్ తదితరులు ఉన్నారు.