కల్మాడీపై అభియోగాల నమోదుకు కోర్టు ఆదేశం

న్యూఢిల్లీ: కామన్వెల్త్‌ కుంభకోణం కేసులో క్రీడల నిర్వాహక  కమిటీ మాజీ ఛైర్మన్‌ సురేష్‌ కల్మాడీతోపాటు మరో పది మందిపై అభియోగాలు నమోదు చేయాలని ఢిల్లీ కోర్టు ఆదేశించింది. వీరిపై వంచన, ఫోర్జరీ , కుట్ర, అవినీతి నిరోధక చట్టం కింద జనవరి 19లోగా అభియోగాలు నమోదు చేయాలని కోర్టు పేర్కొంది.