కాంగ్రెస్ ఆదర్శంగా నిలవాలి: కోదండరాం
హైదరాబాద్: తెలంగాణపై అఖిలపక్షానికి పిలిచిన కాంగ్రెస్ స్పష్టమైన వైఖరి ప్రకటించి మిగతా పార్టీలకు ఆదర్శంగా నిలవాలని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం సూచించారు. ఇందిరా పార్కు వద్ద నిర్వహించిన జేఏసీ ధర్నాలో ఆయన ప్రసంగించారు. అఖిలపక్షంలో అనుకూలంగా వ్యవహరించని పార్టీలకు తెలంగాణలో స్థానం లేకుండా చేస్తామని హెచ్చరించారు. అఖిలపక్ష సమావేశం తర్వాత పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ ఉంటుందని తేల్చిచెప్పారు. మార్చిలో నిర్వహించే అసెంబ్లీ ముట్టడితో హైదరాబాద్ దద్దరిల్లుతుందని తెలియజేశారు.