కాంగ్రెస్ పార్టీలో పునరుత్తేజం వచ్చేనా
సమర్థ నేత లేక సతమతమవుతున్న కాంగ్రెస్
ప్రియాంకకు పగ్గాలు అప్పగించేందుక సోనియా అయిష్టత
న్యూఢల్లీి,అక్టోబర్25 ,(జనంసాక్షి): కాంగ్రెస్ పార్టీ పెద్దఎత్తున పునరుజ్జీవం పొందగలదని ఆశిస్తున్న వారంతా పార్టీలో జరుగుతున్న పరిణామాలు మింగుడు పడడడం లేదు. రాహుల్ కన్నా ప్రియాంక బెటర్ అనుకుం టున్న వేరే ఎక్కువగా ఉన్నారు. ప్రియాంకను పార్టీ అధ్యక్షపదవిలో కూర్చోబెట్టాలని చాలామంది కోరుకుం టున్నా వారి ప్రయత్నాలు సఫలం అయ్యేలా కనిపించడం లేదు. ఇందుకు సోనియా కూడా సుముఖంగా లేరు. అలావుండి వుంటే ఆమెకు పగ్గాలు అప్పగించి సాహసం చేసేవారు. నిజానికి ప్రియాంకకు పార్టీ బాధ్యతలు అప్పగిస్తే మార్పు వస్తుందని నమ్ముతున్న వారే కాంగ్రెస్‌లో ఎక్కువగా ఉన్నారు. దేశంలో కాంగ్రెస్‌ను నమ్మేవారిలో కూడా ఇదే విశ్వాసం ఉంది. అందుకే పార్టీ జవజీవాలు నింపుకోవాలని గత రెండేళ్లుగా ఆశిస్తున్న వారికి పరిస్థితులు ఆశాజనకంగా కనపడడం లేదు. ఇటీవల జరిగిన కాంగ్రెస్ వర్కింగ్
కమిటీ సమావేశంలో పార్టీ సంస్థాగత ఎన్నికలు మరో ఏడాది తర్వాత జరుగుతాయని తేలింది. రాహుల్‌నే మరోమారు అధ్యక్షుడిగా కొనసాగించాలని కూడా చాలామంది ఆశించారు. అయినా ఎందుకనో సోనియా కూడా ధైర్యంగా కూతురికి పగ్గాలు అందించడం లేదు. అలాగే రాహుల్ కూడా ధైర్యంగా పగ్గాలు చేపట్టడం లేదు. అయితే కొత్త అధ్యక్షుడు 2022 అక్టోబర్ కల్లా ఎన్నికవుతాడని నిర్ణయించారు. అంతవరకూ తానే పూర్తిస్థాయి అధ్యక్షురాలిగా కొనసాగుతానని సోనియాగాంధీ ప్రకటించారు. అంటే వచ్చే ఏడాది వరకూ పార్టీలో ఇప్పుడున్న జడత్వమే కొనసాగుతుందని అర్థమవుతోంది. నిజానికి సోనియాగాంధీ క్రియాశీలకంగా ఉండి, దేశంలోని దేశంలోని వివిధ పార్టీలనన్నీ ఏకతాటిపై తేగల సత్తా కానరావడం లేదు. సోనియాగాంధీ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న పరిస్థితులకూ, ఇప్పటి పరిస్థితులకూ తేడా ఉన్నది. సోనియా, రాహుల్ నాయకత్వాన్ని ధిక్కరించి వేరు కుంపటి పెట్టేవారు కాంగ్రెస్‌లో లేకున్నా సణుగుడు నేతలు ఉన్నారు. వారంతా అప్పుడప్పుడు లేఖలతో చికారకు పెడుతూనే ఉంటారు. పార్టీలో సమర్థ నాయకత్వం లేకపోవడమే ఇందుకు కారణం. ఇప్పుడున్న సీనియర్ నేతల్లో ఎక్కువ మంది చేవ చచ్చిన వారే ఉన్నారు. పార్టీలో ఉద్దండులు ఉన్నారని చెప్పుకోవడానికి కూడా లేదు. దాని వల్ల పార్టీలో సుస్థిరత కానీ, పటిష్ఠత కానీ ఏర్పడే సూచనలు కనపడడం లేదు. బిజెపి పట్ల తలెత్తుతున్న ప్రజా వ్యతిరేకతను అందిపుచ్చుకుని ప్రజలకు విశ్వాసం కలిగిం,ఏ నాయకత్వం కాంగ్రెస్‌లోనూ కానరావడం లేదు. విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితుల్లో 74 సంవత్సరాల సోనియాగాంధీయే కాంగ్రెస్‌కు దిక్కయ్యారు. అయితే తెరవెనక రాహుల్ గాంధీయే అన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని అంటున్నా అవేవీ ఫలితాలు ఇవ్వడం లేదు. తల్లి వెనుక సీటులో కూర్చుని డ్రైవింగ్ చేయాలని రాహుల్ గాంధీ భావిస్తున్నట్లుగా ఉంది. పార్లమెంట్ లోనూ, బయటా మోదీతో ముఖాముఖి తలపడేందుకు ఆయనలో ఇంకా ఆత్మవిశ్వాసం ఏర్పడలేదని స్పస్టం అవుతోంది. నిజానికి రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షుడుగా ఉన్నా, పరోక్షంగా పార్టీ అధ్యక్ష పదవి బాధ్యత నిర్వర్తిస్తున్నా దాని వల్ల పార్టీకి ప్రయోజనం కలిగిందన్న ఉదాహరణలు లేవు. వివిధ రాష్టాల్లో జరిగిన ఎన్నికల ఫలితాలు కూడా రాహుల్ బలహీనమైన నాయకత్వాన్ని ప్రతిఫలించాయి. బహుశా ఏదో ఒక ఎన్నికలో తన ప్రభావం చూపిన తర్వాత కాని రాహుల్ నాయకత్వం చేపట్టే అవకాశాలు లేకపోవచ్చు. పార్టీ బలహీనంగా ఉన్నప్పుడు దాన్ని బలోపేతం చేసి తన సత్తా నిరూపించుకోగలగాలి. ఇప్పుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్‌కు అలాంటి ఊపు అందించగల నాయకత్వం ఇవ్వగలరా అన్నది కూడా ప్రశ్నార్థకమే.
జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండి, తాను ముఖాముఖి బిజెపిని ఢీకొనగలిగిన సీట్లలో సత్తా చూపించగలదన్న నమ్మకం కలిగిస్తే కాని దేశంలో మిగతా ప్రతిపక్షాలకు కాంగ్రెస్ పట్ల విశ్వాసం కలగదు.
రాహుల్ తన నాయకత్వ పటిమ ఇంకా రుజువు చేసుకోలేదు.