కాల్పులకు దిగితే శాంతికి విఘాతం

జమ్మూ: నియంత్రణ రేఖ(ఎల్‌వోసీ) వద్ద ఉన్న భారత సరిహద్దు పోస్టులను లక్ష్యంగా చేసుకోవద్దని పాకిస్థాన్‌ భారత్‌ స్పష్టం చేసింది. కాల్పుల విరమణ ఒప్పందానికి విరుద్ధంగా, అక్కడ పాక్‌ సౌనికులు కాల్పులు లాంటి రెచ్చగొట్టే చర్యలకు దిగితే శాంతికి విఘాతం కలుగుతుందని హెచ్చరించింది. శనివారం కాశ్మీర్‌లోని పూంఛ్‌ జిల్లా చకన్‌ దబాగ్‌ వద్దఇరుదేశాల బ్రిగేడియర్‌ స్థాయి సైనికాధికారుల మధ్‌య జరిగిన ఫ్లాగ్‌ మీటింగ్‌లో భారత్‌ తన సందేశాన్ని పాక్‌కు తెలియజేసినట్లు అధికారులు వెల్లడించారు. గత వారం భారత సరిహద్దు పోస్టులు లక్ష్యంగా పాక్‌ సైనికులు కాల్పులకు దిగగా, భారత జవాన్లు ప్రతికాల్పులు జరిపారు. ఘటనలో ఇద్దరు భారత సైనికులు చనిపోయారు. ఇలాంటి చర్యలకు దిగితే ప్రతిస్పందించే హక్కు తమ సైనికులకు ఉంటుందని ప్లాగ్‌ మీటింగ్‌లో పాక్‌కు భారత్‌ స్పష్టం చేసింది. ఉభయ దేశాల మధ్‌య 2003నవంబర్‌ నుంచి కాల్పుల విరమణ ఒప్పందం అమలవుతోంది.