కాశ్మీర్‌లో ప్రణబ్‌ విస్తృత ప్రచారం

ఎన్సీ, పీడీపీ మద్దతు కోరిన దాదా
జమ్మూ-కాశ్మీర్‌, జులై 15 :
యుపీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా పొటీ చేస్తున్న కేంద్ర మాజీ మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ ప్రచారంలో భాగంగా ఆదివారం జమ్మూ-కాశ్మీర్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా తనకు మద్దతు తెలపాలని నేషనల్‌ కాన్ఫెరెన్స్‌(ఎన్‌ సీ), కాంగ్రెస్‌, పీడీపీ ప్రజాప్రతినిధులను కోరారు. సీపీక్ష్మ ఎమ్మెల్యే ఎమ్‌ వై తరిగామి, మరో ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలను అయన కలవనున్నారు. అంతకుముందు అక్కడ విమానాశ్రయంలో ప్రణబ్‌ కు పీసీసీ అధ్యక్షుడు సైపుద్దీన్‌ సోజ్‌ ఘనస్వాగతం పలికారు.