కుప్పకూలిన ఆసీన్ టాప్‌ఆర్డర్
హైదరాబాద్: భారత్ బౌలర్ల ధాటికి రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ కుప్పకూలింది. 63 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ఆసీన్ పీకల్లోతుకష్టాల్లో పడింది. భువనేశ్వర్‌కుమార్ ఒక్కడే మూడు వికెట్లు తీశాడు. హగ్గీన్ (19) అశ్విన్ బౌలింగ్‌లో ధోనికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అంతకుముందు భువనేశ్వర్‌కుమార్ బౌలింగ్‌లో వాట్సస్ (23), కొవాన్ (4), వార్నర్ (6) ఔటయ్యారు. 22 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా 4 వికెట్ల నష్టానికి 63 పరుగులతో ఆడుతోంది.