కృష్ణానదిలో నిలిచిన బల్లకట్లు: 70 మంది ప్రయాణికుల ఆందోళన

గుంటూరు: గుంటూరు జిల్లా మాచవరం మండలం గోవిందాపురం వద్ద కృష్ణానదిలో బల్లకట్టు అర్థాంతరంగా నిలిచిపోయింది. దాంతో దానిపై ఉన్న 70 మంది ప్రయాణీకులు  ఆందోళన చెందుతున్నారు. బల్లకట్టు సాంకేతిక లోపంతో నిలిచిపోయినట్లు సమాచారం.